Ramanthapur: రామంతాపూర్‌లో భక్త మార్కండేయ శివాలయ ముఖద్వారం ప్రారంభం!

Ramanthapur: రామంతాపూర్ భక్త మార్కండేయ శివాలయ నూతన ముఖద్వారాన్ని ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

KARUNAKAR, UPPAL
Published on: 11 Oct 2026 4:44 PM IST
Ramanthapur
X

Ramanthapur: రామంతాపూర్‌లో భక్త మార్కండేయ శివాలయ ముఖద్వారం ప్రారంభం!

రామంతాపూర్‌: రామంతాపూర్‌లోని హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న భక్త మార్కండేయ శివాలయానికి వెళ్లే మార్గంలో ఆనంద్‌ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుండ్ల రవీందర్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ప్రారంభించారు.

ముఖద్వారం ఏర్పాటు చేయడంతో ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఈ సందర్భంగా స్థానిక పద్మశాలీ సంఘం ప్రతినిధులు, నాయకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పద్మశాలీ సామాజిక వర్గ అభివృద్ధి, సంక్షేమానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంఘాలు, నాయకులు, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక పురోగతికి పరస్పర సహకారం, ఐక్యత ఎంతో అవసరమని తెలిపారు. ఆలయాలు ఆధ్యాత్మిక చింతనకు కేంద్రాలుగా నిలుస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు స్థానికులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆనంద్‌ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుండ్ల రవీందర్‌ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో ముఖద్వారం ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు ఆలయాన్ని గుర్తించడం సులభతరమవుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో రామంతాపూర్‌ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొండ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సిరిసాల విజయ ప్రకాశ్‌, కోశాధికారి కొంగరి బాలచంద్రయ్య, పద్మశాలీ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL