Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం..బావిలో తల్లి, పిల్లల మృతదేహాలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గూర్తి శివారులోని బావిలో పడి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

WAZID, PARIGI
Published on: 3 Oct 2026 10:15 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం..బావిలో తల్లి, పిల్లల మృతదేహాలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమన్‌గూర్తి గ్రామ శివారులో ఓ వ్యవసాయ బావిలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మమత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మమతకు భర్త రాజుతో నిన్న ఉదయం గొడవ జరిగినట్లు సమాచారం. అనంతరం తన పిల్లలు సాకేత్‌ (8), జనశ్రీ (4) లను తీసుకుని ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయారు.అప్పటి నుంచి కుటుంబ సభ్యులు మమత, పిల్లల కోసం వెతికారు. నిన్న రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.ఈ క్రమంలో సోమన్‌గూర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి దగ్గర చెప్పులు, బ్యాగ్ కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

బావిలో పరిశీలించగా మమత, ఆమె కుమార్తె జనశ్రీ మృతదేహాలు కనిపించాయి.పోలీసులు మమత, జనశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా బాలుడు సాకేత్‌ కోసం బావిలో గాలింపు కొనసాగుతోంది. మృతులు మాటుగూడెం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.ఈ ఘటనతో మాటుగూడెం, సోమన్‌గూర్తి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

WAZID, PARIGI

WAZID, PARIGI