Moinabad: మొయినాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి బాలిక మృతి!
Moinabad: మొయినాబాద్ సురభి వెంచర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలోని నీటితో నిండిన లిఫ్ట్ గుంతలో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల బాలిక విద్యాశ్రీ మృతి చెందింది.
Moinabad: మొయినాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి బాలిక మృతి!
మొయినాబాద్: నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ గుంత నీటితో నిండిపోవడంతో అందులో ప్రమాదవశాత్తు పడిన మూడేళ్ల బాలిక విద్యాశ్రీ మృతి చెందిన విషాద ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ గ్రామానికి చెందిన నరేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. భార్య గంగమ్మ, కుమార్తె విద్యాశ్రీ(3), కుమారుడు విష్ణు(2)తో కలిసి నివసిస్తున్న అతనికి సుమారు పది నెలల క్రితం మామ బుగ్గప్ప ద్వారా మొయినాబాద్‌లోని సురభి వెంచర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద నరసింహ మేస్త్రి వద్ద పని కుదిరింది.
అప్పటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో అక్కడే ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నిర్మాణ పనులు చేస్తుండగా, మధ్యాహ్నం అనారోగ్యంతో నరేష్ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రం భార్య గంగమ్మ కుమార్తె కనిపించడం లేదని చెప్పడంతో ఇద్దరూ వెతకగా, భవనంలో లిఫ్ట్ కోసం తవ్విన నీటితో నిండిన గుంతలో విద్యా శ్రీ మృతదేహం కనిపించింది. తమ్ముడు విష్ణుతో కలిసి కింద అంతస్తులో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు గుంతలో పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




