LB Nagar: డిసెంబర్ 1–3 తేదీల్లో ఢిల్లీ చలోకు తరలిరావాలి: సీఐటీయూ!
LB Nagar: లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం రూ. 42 వేల అమలుకై డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ చలో పార్లమెంట్‌కు తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున పిలుపునిచ్చారు.
LB Nagar: డిసెంబర్ 1–3 తేదీల్లో ఢిల్లీ చలోకు తరలిరావాలి: సీఐటీయూ!
ఎల్బీనగర్: సిఐటియు రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు జాజాల రుద్ర కుమార్ అధ్యక్షతన తుర్కయంజాల్ లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డి. జగదీష్ గత కార్యక్రమాల సమీక్షను ప్రవేశపెట్టి, జిల్లాలో కార్మిక సంఘాల కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై విమర్శలు చేశారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లాలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఐక్యంగా ముందుకు వచ్చి ఢిల్లీ ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం ఐక్య పోరాటాలే మార్గమని నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేస్తూ ఢిల్లీలో జరిగే ఆందోళనకు అత్యధిక పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోశాధికారి జి కవిత ఉపాధ్యక్షులు డి కిషన్ ఎన్ రాజు, మల్లేష్, దేవేందర్, పెంటయ్య, స్వప్న, ఎల్లేష్ వీరయ్య, ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ ఈ నరసింహ పి జగన్ టీ నరసింహ పెట్టుకుంటాము కృష్ణయ్య చైతన్య చందు నాయక్ పోచమోని కృష్ణ గ్యార పాండు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.




