AS Rao Nagar: ఉప్పల్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక భేటీ
AS Rao Nagar: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశం జరిగింది.
AS Rao Nagar: ఉప్పల్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక భేటీ
AS Rao Nagar: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లోని ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎంఎల్‌సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎంఎల్‌సీ ఎన్నికల ఇంచార్జ్, నల్గొండ మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ, నమోదు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన కార్యాచరణపై వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యత ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమన్వయంతో పనిచేస్తూ, పట్టభద్రులందరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డివిజన్ స్థాయి బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.




