Jubilee Hills: కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Jubilee Hills: మొదటి కార్తీక సోమవారం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాముల అన్నదానంలో పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 16 Nov 2026 4:03 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Jubilee Hills: మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు.

మొదటి కార్తీక సోమవారం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్ష చేపట్టిన స్వాముల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి వెంగళరావునగర్ డివిజన్‌లోని డీటీఎచ్ దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం వడ్డించారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE