LB Nagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి ఎమ్మెల్యే!
LB Nagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
LB Nagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి ఎమ్మెల్యే!
LB Nagar: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, జహీర్ ఖాన్, పాండుగౌడ్, రూప్‌సింగ్, అనురాధ, పద్మ, విజయలక్ష్మి, రాజు, లింగేశ్వర్, శశి, భాస్కర్, శీను తదితరులు పాల్గొన్నారు.




