LB Nagar: చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి!

LB Nagar: ఎల్బీనగర్‌లో చిరు వ్యాపారులకు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అండ. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాకే రోడ్డు విస్తరణ చేపట్టాలని జీహెచ్‌ఎంసీని కోరారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Updated on: 29 Oct 2026 5:26 PM IST
LB Nagar
X

LB Nagar: చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి!

LB Nagar:పేదల ఉపాధికి భరోసా కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలి! అభివృద్ధి పనుల పేరుతో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధికారులను కోరారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్‌ ఆర్చ్‌ నుంచి టీకేఆర్‌ కళాశాల వరకు 100 అడుగుల రహదారి నిర్మాణ ప్రణాళికలో భాగంగా రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గురువారం ఉదయం 6 గంటలకు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరు వ్యాపారులు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు వివరించారు. రహదారికి అడ్డంగా ఉందని చెబుతున్న టీకేఆర్‌ ఆర్చ్‌ను తొలగించకుండా, నందనవనం ప్రాంతంలో జీవనోపాధి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న పేదల డబ్బాలను మాత్రమే తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, రాజకీయ అండదండలు ఉన్నవారికి మరో న్యాయమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

*కమిషనర్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో చర్చ*

చిరు వ్యాపారుల సమస్యలపై స్పందించిన సుధీర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వికాస్‌ మహాతో ఫోన్‌లో మాట్లాడారు. పేద వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులపాటు కూల్చివేతలను నిలిపివేయాలని కోరారు. వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళిక రూపొందించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై జోనల్‌ కమిషనర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

*అభివృద్ధితోపాటు పేదల ఉపాధి ముఖ్యం*

రహదారి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు ఎంత ముఖ్యమో.. వాటిపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల ఉపాధిని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తూ అందరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్‌ నాయక్‌, కాప్ర నాయక్‌, గోపి మధు, నాగిరెడ్డి, బిక్షపతి, సాయియాదవ్‌, మహేందర్‌, కృష్ణ, నరేష్‌, రెడ్డిమాల కృష్ణ, విష్ణు గౌడ్‌, అనిత, కింగ్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR