LB Nagar: పెండింగ్ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడో? ఎమ్మెల్యే నిలదీత!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.
LB Nagar: పెండింగ్ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడో? ఎమ్మెల్యే నిలదీత!
LB Nagar: నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మల్కాజిగిరి ఈడీ పంకజను కలిసి నూతన, పెండింగ్ డ్రైనేజీ పనులకు పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కాలనీల్లో డ్రైనేజీ పనులకు విజ్ఞప్తి
బైరామల్‌గూడలోని గోకుల్ ఎన్క్లేవ్, హయత్‌నగర్ పరిధిలోని సిరిహిల్స్, శ్రీ గాయత్రి నగర్, దత్తాత్రేయ నగర్, బెల్లయాదవ్ నగర్, సాయిరాంనగర్, శ్రీ వినాయక నగర్, శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీల్లో పనులు చేపట్టాలని కోరారు.
హస్తినాపురం పరిధిలోని డైమండ్ కాలనీ, సుల్తాన్ వాల్వ్ వీకర్ సెక్షన్, శ్రీ వెంకటేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ ఫేజ్-2, హస్తినాపురం రెసిడెన్షియల్ కాలనీ, ఖాద్రి కాలనీల్లోనూ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మన్సూరాబాద్ పరిధిలోని సీఎస్ఆర్ కాలనీ, సీఆర్ ఎన్క్లేవ్, జడ్జెస్ కాలనీ ఫేజ్-1, శ్రీరామ్‌నగర్; బీఎన్ రెడ్డినగర్ పరిధిలోని బీఎన్ రెడ్డినగర్, శ్రీపురం; చైతన్యపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ; వనస్థలిపురంలోని శారదానగర్ కాలనీల్లో పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
అలాగే కొత్తపేట పరిధిలోని గణేష్‌నగర్, సత్యనగర్, రాజీవ్‌గాంధీ కాలనీలు, నాగోల్‌లోని ఆప్కో కాలనీ, గడ్డిఅన్నారం పరిధిలోని తిరుమలనగర్ కాలనీల్లో డ్రైనేజీ పనులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
పనులు పూర్తి చేస్తాం: ఈడీ పంకజ
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమర్పించిన నివేదిక ప్రకారం కొన్ని పనులకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినట్లు ఈడీ పంకజ తెలిపారు. ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీల్లో డ్రైనేజీ పనులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులను కూడా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.




