Secunderabad: జేబీఎస్ వద్ద ఇందిరా గాంధీకి ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళులు!
Secunderabad: సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Secunderabad: జేబీఎస్ వద్ద ఇందిరా గాంధీకి ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళులు!
Secunderabad: నేషనల్ బ్యాంకులను అన్ని వర్గాలతో పాటు పేదలు కూడా లావాదేవీలు జరుపుకునే విధంగా మార్చిన ఘనత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలదేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ జేబీఎస్ ముందు ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశంలో "గరీబీ హఠావో" నినాదంతో ఇందిరా గాంధీ సుపరిపాలన అందించిన గొప్ప నాయకురాలని, దేశ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన నాయకురాలని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.




