Secunderabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్. బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు.

Srikanth, Secunderabad
Published on: 19 Sept 2026 1:01 PM IST
Secunderabad
X

Secunderabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ!

Secunderabad: కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగా నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3-4 నెలల్లోనే చెక్కుల మంజూరు గత బీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కు రావడానికి సంవత్సర కాలం పట్టేదని, కానీ నేడు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో దరఖాస్తు చేసుకున్న కేవలం 3 నుంచి 4 నెలల్లోపే చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు.

ఎమ్మార్వో వెంటనే సంతకాలు తీసుకుని ప్రభుత్వానికి పంపడం వల్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.కాంగ్రెస్‌కు మంచి పేరు రావద్దనే బీఆర్ఎస్ కోర్టు కేసులు ప్రజలకు మేలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న కడుపుమంటతో బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ టీమ్ కోర్టుల్లో కేసులు వేయించి పథకాలను రద్దు చేయాలని చూశారని మండిపడ్డారు.

కోర్టు స్టే ఇవ్వడం వల్లే చెక్కుల పంపిణీ కొద్దిరోజులు ఆలస్యమైందని, ప్రజలకు నష్టం కలిగించి రాక్షసానందం పొందడమే బీఆర్ఎస్ లక్ష్యమని ధ్వజమెత్తారు. వర్షాలు రాకూడదని, పంటలు ఎండిపోయి ప్రజలు ఇబ్బంది పడాలని హరీష్ రావు లాంటి నాయకులు క్షుద్రపూజలు కూడా చేశారని ఆరోపించారు.అసెంబ్లీలో బీఆర్ఎస్ భూముల బాగోతం బట్టబయలు: మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల భూముల దోపిడీ బట్టబయలైందని గుర్తుచేశారు.

కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, వారి బంధువుల పేర్ల మీద సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు వేల ఎకరాల భూములను దోచుకున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసి, ప్రజాధనంతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకున్నారని దుయ్యబట్టారు.పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం: ప్రజా ప్రభుత్వం వచ్చాకే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు, బ్రేక్‌ఫాస్ట్ ఖర్చులు తగ్గించేందుకు చౌరస్తాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు, ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.హామీలన్నీ అమలు చేసి తీరుతాం బీఆర్ఎస్ పాలనలో ఖజానా ఖాళీ చేసి, భూములను దోచుకుపోవడం వల్లే తులం బంగారం, రూ. 2500 ఆర్థిక సాయం వంటి పథకాలు కొద్దిగా ఆలస్యమవుతున్నాయని, అయితే కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటనూ త్వరలోనే నెరవేర్చి తీరుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad