Boduppal: చిల్పకుంట్ల పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే మందుల సామేలు!
Boduppal: మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా బోడుప్పల్‌లోని తన నివాసంలో 30 మంది చిల్పకుంట్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పంపిణీ చేశారు.
Boduppal: చిల్పకుంట్ల పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే మందుల సామేలు!
Boduppal: రాష్ట్రంలో గుడిసెలు లేని పరిస్థితిని తీసుకురావడానికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని తన నివాసంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 30 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి ఇప్పటివరకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మరో 2,000 ఇళ్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు.
అర్హులైన పేదలకు ఇళ్లు అందించి, వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్లు అందించామని, అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ గృహ నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని సామేలు గుర్తుచేశారు. అయితే, గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్ల అంశంపై నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. పేదల సంక్షేమం, గృహ వసతి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.




