Injapur: ఇంజపూర్‌లో రూ.54 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన!
Injapur: ఇంజపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.54 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు.
Injapur: ఇంజపూర్‌లో రూ.54 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన!
Injapur: విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి సమాజాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.54 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ఆరుట్ల తరహాలో మరిన్ని విద్యా కేంద్రాలు
నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలి టీపీఎస్‌ను ఆరుట్లలో ఏర్పాటు చేశామని, అక్కడ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ప్రస్తుతం ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఆరుట్ల టీపీఎస్ తరహాలో నియోజకవర్గంలో మరిన్ని విద్యా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




