Hyderabad: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మేళా ప్రారంభం!

Hyderabad: మోతీనగర్‌లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. దసరా, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక వస్త్రాలు.

RAJESH,	WEST ZONE
Published on: 3 Oct 2026 10:42 AM IST
Hyderabad
X

Hyderabad: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మేళా ప్రారంభం!

Hyderabad: దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ చేనేత వస్త్రాలు, హస్తకళలను ఒకే చోటఅందుబాటులో ఉంచ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు అన్నారు .హైద‌రాబాద్ మోతీ న‌గ‌ర్ క‌మ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్ మేళాను నిర్వ‌హ‌కుల‌తో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు.

చేనేత క‌ళాకారులు త‌యారు చేసిన వ‌స్త్ర ఉత్ప‌త్తులు, హ‌స్త‌క‌ళాకారులు త‌యారు చేసిన హ్యాండీ క్రాఫ్ట్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని తెలిపారు. ద‌స‌రా, బ‌తుక‌మ్మ‌, దీపావ‌ళి పండుగ‌ల‌ను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌గిరి ,ఉప్పాడ‌, వెంక‌ట‌గిరి ,భాగ‌ల్ పూర్ శారీస్ తో పాటు డిజైన‌ర్ వేర్ ఉత్ప‌త్తులు ఇక్క‌డ అందుబాటులో ఉంచామ‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు.

ఈ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల ఒక‌టో తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది . దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల‌కు చెందిన బ్రాండెడ్ వ‌స్త్ర ఉత్ప‌త్తులు వీవ‌ర్స్ టు క‌స్ట‌మ‌ర్ కు అందిస్తున్న‌ట్లు నిర్వ‌హ‌కులు మ‌హ్మ‌ద్ సాబేర్ అలీ ,అక్బ‌ర్ అలీ తెలిపారు. ప్ర‌తి రోజు ఉద‌యం ప‌ది నుండి రాత్రి ప‌ది వ‌ర‌కు ఈ ఎగ్జిబిష‌న్ అందుబాటులో ఉంటుంద‌న్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE