LB Nagar: రూ.3 కోట్లతో నిర్మించిన సుందరమైన పార్కు ప్రారంభం!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో పదేళ్ల న్యాయపోరాటం తర్వాత రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన సుందరమైన పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
LB Nagar: రూ.3 కోట్లతో నిర్మించిన సుందరమైన పార్కు ప్రారంభం!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-1, విశ్వేశ్వరయ్య కాలనీల ప్రజలకు ఊరట కలిగించేలా సంయుక్తంగా దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన సుందరమైన పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు పదేళ్ల క్రితమే పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ, కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజలకు పార్కును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
అభివృద్ధిని కొంతకాలం అడ్డుకోవచ్చుగానీ.. చివరకు న్యాయమే గెలుస్తుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా తీసుకుని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు సత్యం చారి, స్థానిక నాయకులు భూపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, యాదగిరి, కరుణాకర్, ప్రతాప్, ప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అమర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




