Nacharam: నాచారంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!
Nacharam: నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లలో సుమారు కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
Nacharam: నాచారంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!
Nacharam: నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లలో సుమారు రూ.కోటి విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. సాయినగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ.9 లక్షలు, శ్రీరాఘవేంద్రనగర్‌లో మంచినీటి పైప్‌లైన్ నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరువ్వగా, కౌండిన్యనగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.33.8 లక్షలు, భవానీనగర్‌లో మిగిలిన సీసీ రోడ్ల పనులకు రూ.47.8 లక్షలు, రాఘవేంద్రనగర్‌లో శివ నర్సింగ్ హోమ్ వెనుక వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు కేటాయించారు.
ఈ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్‌గౌడ్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.సాయి పృథ్వి, ఏఈ సూరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, రామారావు, జలమండలి మేనేజర్ రోహిత్, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.




