Uppal: నిమ్స్‌లో చికిత్స కోసం మరో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ!

Uppal: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామగిరి లలితకు అదనంగా మరో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరైంది.

ASHOK, KAPRA
Published on: 6 Oct 2026 10:09 PM IST
Uppal
X

Uppal: నిమ్స్‌లో చికిత్స కోసం మరో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ!

ఉప్పల్: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషితో లలితకు ఆర్థిక సహాయం, జనగాం జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన రామగిరి లలిత, భర్త అశోక్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మరో రూ.2 లక్షల అదనపు LOC మంజూరైంది.

లలిత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అదనపు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికే గత 15 రోజుల క్రితం మంజూరైన LOCకు అదనంగా ఈ రూ.2 లక్షల సహాయం అందించారు.

ఈ మొత్తాన్ని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), పంజాగుట్టలో లలిత చికిత్సకు వినియోగించుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందేలా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA