Kapra: డా. ఏఎస్ రావు నగర్‌లో రూ.1.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్‌లో రూ.1.45 కోట్లతో పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ASHOK, KAPRA
Published on: 13 Nov 2026 1:56 PM IST
Kapra
X

Kapra: డా. ఏఎస్ రావు నగర్‌లో రూ.1.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలోని డా. ఏఎస్ రావు నగర్ లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, చిన్నారులకు ఆటస్థలాలు, యువతకు వ్యాయామ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రూ.1.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.థీమ్ పార్క్ – ఓపెన్ జిమ్, EPDM ఫ్లోరింగ్ – రూ.17.50 లక్షలు.TSIIC గ్రౌండ్ – ఓపెన్ జిమ్, చైన్ లింక్ ఫెన్సింగ్ – రూ.36 లక్షలు.

హాన్స్ అవెన్యూ పార్క్ – ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట పరికరాలు, కాంపౌండ్ వాల్ గ్రిల్ – రూ.23 లక్షలు. విరాట్ నగర్ కాలనీ – వాకింగ్ పాత్‌వే, ఆట పరికరాలు – రూ.6.50 లక్షలు.శ్రీనగర్ కాలనీ పార్క్ – ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట పరికరాలు – రూ.22.50 లక్షలు.బీజేఆర్ కాలనీ – బీజేఆర్ జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు సీసీ రోడ్డు నిర్మాణం – రూ.40 లక్షలు.ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, వ్యాయామ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

చిన్నారులకు సురక్షితమైన ఆట స్థలాలు కల్పించడంతో పాటు కాలనీల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి BRS పార్టీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA