Hyderabad: చర్లపల్లి డివిజన్లో రూ.3.82 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Hyderabad: చర్లపల్లి డివిజన్లో రూ.3.82 కోట్ల వ్యయంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
Hyderabad: చర్లపల్లి డివిజన్లో రూ.3.82 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Hyderabad: చర్లపల్లి డివిజన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా 3 కోట్ల 82 లక్షల 70 వేలతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల
పెద్ద చర్లపల్లి గ్రామం – ₹45 లక్షలు
వీఆర్ కాలనీ – ₹26 లక్షలు
మింట్ కాలనీ & రెడ్డి కాలనీ – ₹22 లక్షలు బి.ఎన్. రెడ్డి నగర్ – ₹46 లక్షలు ఈసీ నగర్ – ₹49 లక్షలు
డాక్టర్స్ కాలనీ & నేతాజీ నగర్ – ₹49 లక్షలు బి.ఎన్. రెడ్డి నగర్ ఫేజ్-2 – ₹49 లక్షలు బి.ఎన్. రెడ్డి నగర్ ఫేజ్-1 – ₹49.70 లక్షలు
రైల్ విహార్ కాలనీ – RCC పైపులైన్ నిర్మాణాలు చేపడుతున్నారు, కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలతో పాటు మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




