Kapra: కాప్రాలో రూ.84 లక్షల పనులకు ఎమ్మెల్యే బండారి శంకుస్థాపన

Kapra: కాప్రా డివిజన్‌లో రూ.84 లక్షల వ్యయంతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ASHOK, KAPRA
Published on: 10 Nov 2026 7:08 PM IST
Kapra
X

Kapra: కాప్రాలో రూ.84 లక్షల పనులకు ఎమ్మెల్యే బండారి శంకుస్థాపన

కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలో కాప్రా లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఉమ్మడి కాప్రా డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి నగర్, సీనియర్ సిటిజన్స్ కాలనీ, కృష్ణ నగర్ ప్రాంతాల్లో చేపట్టనున్న యు జి డి , సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల గోపాల్ రెడ్డి నగర్: UGD పనులు – రూ.14 లక్షలు. సీనియర్ సిటిజన్స్ కాలనీ: CC రోడ్డు నిర్మాణం – రూ.40 లక్షలు.

కృష్ణ నగర్: UGD పనులు – రూ.30 లక్షలు.మొత్తం రూ.84 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన రహదారులు, సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ అందించడమే లక్ష్యంగా పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, పార్టీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA