Uppal: కమిటీ సభ్యులు ఐక్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలి!

Uppal: నాగార్జున నగర్ కాలనీ నూతన వెల్ఫేర్ కమిటీ సభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సన్మానించి, కాలనీ అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

ASHOK, KAPRA
Published on: 18 Nov 2026 6:57 AM IST
Uppal
X

Uppal: కమిటీ సభ్యులు ఐక్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలి!

Uppal: కుషాయిగూడ డివిజన్ క నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులను సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు.

నాగార్జున నగర్ కాలనీ సర్వతాముకాభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు ఐక్యత గా ఉంటూ కాలనీ అభివృద్ధికి పనిచేశారు కాబట్టి కాలనీ ప్రజలు మరోసారి అవకాశం కల్పించారని, ఐక్యంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డివిజన్ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, గంప కృష్ణ, నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, ప్రధాన కార్యదర్శి మొగిలి కరుణాకర్ రెడ్డి, కోశాధికారి బొల్లంపల్లి శ్రీకాంత్ రెడ్డి,

ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్, భైరంకొండ గోపాల్ యాదవ్, మచ్చ మహేష్ గౌడ్, సహాయ కోశాధికారి సాయి వివేక్, సంయుక్త కార్యదర్శిలు మేడిపల్లి శ్రీశైలం, ఎస్ నాగరాజు గౌడ్, బి వెంకటేష్ గౌడ్, కార్యనిర్వహణ కార్యదర్శులు ఎండి జహంగీర్ పాషా, సిహెచ్ కొండల్ రెడ్డిలు ఉన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA