Miyapur: మియాపూర్లో బీజేపీ ‘మన్ కీ బాత్’ వీక్షణ, ఓటర్ల నమోదు!
Miyapur: శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్, మయూరి నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో 139వ మన్ కీ బాత్ వీక్షణ, పట్టభద్రుల ఓటర్ల నమోదు అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు.
Miyapur: మియాపూర్లో బీజేపీ ‘మన్ కీ బాత్’ వీక్షణ, ఓటర్ల నమోదు!
మియాపూర్: మియాపూర్, మయూరి నగర్ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో 139వ ‘మన్ కీ బాత్’ వీక్షణ కార్యక్రమం మరియు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. మయూరి నగర్ డివిజన్ లక్ష్మీ ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీలో మన్ కీ బాత్ వీక్షించగా, మియాపూర్ డివిజన్ విడియా కాలనీలోని పార్టీ నాయకుడు సమ్మెట ప్రసాద్ నివాసంలో ఓటర్ల నమోదుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ రేఖా శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు, పట్టభద్రులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలను, దేశాభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న 'మన్ కీ బాత్' విజవంతంగా 139వ ఎపిసోడ్కు చేరుకోవడం హర్షణీయమన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు తమ ప్రజాస్వామ్య హక్కును గుర్తించి వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ రేఖా శర్మ మాట్లాడుతూ... ఓటర్ల నమోదు ప్రక్రియలో యువత చూపిస్తున్న ఆసక్తి అభినందనీయమన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయి సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ... రాబోయే పట్టభద్రుల మరియు జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో విజయామే లక్ష్యంగా శేరిలింగంపల్లిలోని ప్రతి బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి & శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఓటర్ల నమోదును వేగవంతం చేయడంతో పాటు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. నిస్వార్థంగా శ్రమిస్తున్న ప్రతి కార్యకర్త కష్టాన్ని పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, రవీందర్ రావు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగులు గౌడ్, సమ్మెట ప్రసాద్, సీతారామరాజు, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్, కృష్ణ, గోపాల్ రావు, ఆంజనేయులు సాగర్, మహేష్ యాదవ్, పద్మ, కాంచన కృష్ణ, శ్రీనివాస్, రాజేష్ గౌడ్, వివిధ మోర్చాల పదాధికారులు, స్థానిక కాలనీవాసులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




