Shamshabad: శంషాబాద్‌లో మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!

Shamshabad: శంషాబాద్ శాతంరాయిలో చీప్ లిక్కర్‌ను ఖరీదైన మద్యం సీసాల్లో నింపి అమ్ముతున్న మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్‌ను ఎక్సైజ్ డిటిఎఫ్ పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసింది.

TELANGANA BUREAU
Published on: 17 Nov 2026 2:21 PM IST
Shamshabad
X

Shamshabad: శంషాబాద్‌లో మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!

Shamshabad: మిక్సింగ్ చేసిన మద్యం 10 బాటిల్లతో పాటు మరో 30 పైగా ఖాళీ బాటిల్ స్వాధీనం. బగ్గా డిక్షనరీలో కొంతకాలంగా పని చేసి, అక్కడ పని మానివేసి క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ డిటిఎఫ్ టీం నరేందర్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే...

గత ఆరు నెలలుగా వంగలి అశోక్ (43) అనే వ్యక్తి బగ్గా. డిస్టలరీ మద్యం తయారీ పరిశ్రమలో లో పని మానివేసి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

శంషాబాద్ లోని శాతం రాయి ప్రాంతంలో తన ఇంట్లో నే తక్కువ ధరలు కలిగిన చీప్ లిక్కర్ మద్యాన్ని ఖరీదైన మద్యం బాటిళ్లలో మిక్సింగ్ చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడయింది.

మహమ్మద్ యాకూబ్ పాషా (29) అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణంలో ఖరీదైన మద్యం బాటిల్లను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి మూతలను తొలగించి అందులో రూ. 560 విలువచేసే డౌన్ టెన్ అనే చీప్ లిక్కర్ను బాటిళ్లలో నింపుతూ అమ్మకాలు సాగిస్తున్నాడని గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు.

చీపులిక్కర్ను ఖరీదైన మద్యం సీసాలో పోసి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ ధనుంజయ్ సీఐ సమాచారం ఇవ్వడంతో అందరు కలిసి వెళ్లి దాడి చేసి అశోక్ ఇంట్లో పెద్ద మొత్తంలో మిక్సింగ్ బాటిల్లను మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ లోని శాతంబాయి ప్రాంతంలో తన ఇంట్లో దాడులు నిర్వహించగా 10 ఫుల్ బాటిల్లు మిక్సింగ్ చేసిన బాటిల్స్ తో పాటు మరో 30 పైగా ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం సీసాలను మహమ్మద్ యాకూబ్ పాషా 29 ఇయర్స్ క్యాబ్ దుకాణం నుంచి తీసుకు వస్తున్నట్లు తెలపడంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు.

ఇలా తక్కువ ధర కలిగినటువంటి మద్యాన్ని ఖరీదైనటువంటి జాన్ వెల్స్ న్ జానీ వాకర్, దివార్స్, 100 పేపర్స్ లాంటి ఖరీదైన బాటిల్లో తక్కువ ధర కలిగినటువంటి మద్యాన్ని నింపి అమ్మకాలు సాగిస్తున్నారు.

ఇ లా చీప్ లిక్కర్ను మిక్సింగ్ చేసి మద్యం బాటిలను స్థానికంగా ఉన్న ఒక పదిమందికి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో సీఐ నరేందర్ తో పాటు ఎస్సై హనుమంతు నజీర్ పాషా ఇంచార్జ్ సీఐ భరత్ కుమార్ ధనుంజయ్ అభి నై కిషన్ భాస్కర్లు ఉన్నారు.

నిందితులను మిక్సింగ్ మద్యం బాటిల్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ ఎస్ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు.

మిక్సింగ్ మద్యం ముఠాను పట్టుకున్నటువంటి డిటిఎఫ్ టీమ్ ను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఈ ఎస్ విజయభాస్కర్ గౌడ్లు అభినందించారు.

TELANGANA BUREAU

TELANGANA BUREAU