Miryalaguda: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ: ప్రయాణికులకు స్వల్ప గాయాలు!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Oct 2026 10:40 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ: ప్రయాణికులకు స్వల్ప గాయాలు!

మిర్యాలగూడ: మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఏడుకొండల తండా సమీపంలో నల్లగొండ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA