Hyderabad: ఆర్టీసీ, మెట్రోలో బస్సులో ప్రయాణించిన మంత్రి గడ్డం వివేక్!

Hyderabad: ఆర్టీసి-మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రులు, ప్రయాణికులతో కలిసి బస్సు, మెట్రోలో ప్రయాణించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Oct 2026 5:29 PM IST
Hyderabad
X

Hyderabad: ఆర్టీసీ, మెట్రోలో బస్సులో ప్రయాణించిన మంత్రి గడ్డం వివేక్!

Hyderabad: ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి సహచర మంత్రులు, సామాన్య ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సు, మెట్రో రైలులో ప్రయాణించారు.

మొదట బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రి.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సచివాలయం వరకు వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో, బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ మొదటి మైలు నుంచి చివరి మైలు వరకు ప్రజలకు సులభమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌కు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకునే విధానం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజా రవాణాపై ప్రయాణికుల అనుభవాలను నేరుగా తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.