Abdullapurmet: బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై పాల ట్యాంకర్‌లో మంటలు!
Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై పాల ట్యాంకర్‌లో మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
Abdullapurmet: బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై పాల ట్యాంకర్‌లో మంటలు!
Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కొత్తగూడెం వద్ద జాతీయ రహదారిపై పాల ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఎల్‌బీనగర్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్‌పై విద్యుత్ వైర్లు తెగిపడి పడటంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




