Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ 104వ వార్షికోత్సవం!

Secunderabad: సికింద్రాబాద్‌లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (MES) 104వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 26 Sept 2026 7:08 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ 104వ వార్షికోత్సవం!

Secunderabad: సికింద్రాబాద్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎం ఈ ఎస్) 104వ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు సందడి చేశాయి. చిన్నారుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను ఆకట్టుకున్నాయి.ప్రతి సంవత్సరం నిర్వహించే ఎం ఈ ఎస్ డే సందర్భంగా ఆర్మీ అధికారులు, సివిల్ అధికారులు, స్థానిక ఉద్యోగుల మధ్య వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.

క్రికెట్, వాలీబాల్, క్యారం బోర్డ్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజేతలకు కమాండర్ వర్క్స్ ఇంజనీర్స్ అధికారులు ట్రోఫీలు, బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు పరస్పరం ఎం ఈ ఎస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో జి ఈ సౌత్, జి ఈ నార్త్, జి ఈ గోల్కొండ, సి డబ్ల్యూ ఈ-1, డబ్ల్యూ ఈ-2 అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad