Amanagallu: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఆమనగల్లులో ప్రైవేట్ జాబ్ మేళా!

Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఈ నెల 13న ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన యువతీ యువకులు హాజరుకావచ్చు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 9:21 PM IST
Amanagallu
X

Amanagallu: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఆమనగల్లులో ప్రైవేట్ జాబ్ మేళా!

ఆమనగల్లు: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఐక్యత ఫాండేషన్ చైర్మన్ టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఫాండేషన్ కార్యాలయంలో ఈనెల 13 మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉదయం 8 గంటల నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభమవుతుందని.

18 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్, ఇతర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటా, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నియోజకవర్గంలో విద్య వైద్యం ఉపాధి అవకాశాలకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొండల్ యాదవ్ చంద్రశేఖర్ తో పాటు తదితరు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY