Hyderabad: మీర్‌పేట్ మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Hyderabad: షేర్ మార్కెట్‌లో రూ.4 కోట్ల నష్టాలతో బంగారం కోసం మహిళను హత్య చేసిన నిందితుడిని మీర్‌పేట్ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేసి 9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

RAHUL, MEERPET
Published on: 12 Nov 2026 10:21 PM IST
Hyderabad
X

Hyderabad: మీర్‌పేట్ మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిభట్ల ఏసీపీ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి మహిళ అనిత హత్య కేసు వివరాలను వెల్లడించారు. ధాతు నగర్‌లోని శ్రీ లక్ష్మీ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న అనిత (34)ను బంగారు ఆభరణాల కోసం అదే అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో నివసించే గడ్డ రాజ్ కుమార్ (41) హత్య చేసినట్లు తెలిపారు.

షేర్ మార్కెట్‌లో సుమారు రూ.4 కోట్ల నష్టాలు రావడంతో పాటు అప్పుల బాధతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హెల్మెట్ ధరించి అనిత ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆమె నోటికి చేతులకు కట్టివేసి ఐరన్ బాక్స్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, గాజులను తీసుకెళ్లినట్లు వివరించారు.

సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలతో పాటు హెల్మెట్, దుస్తులు, మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన ఇనుప వస్తువును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు.

పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డీసీపీ బి. రాజేష్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో మీర్‌పేట్ ఎస్‌హెచ్‌ఓ బి. శోభన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మట్టం రాజు, పోలీస్ సిబ్బంది కేసును ఛేదించారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET