Meerpet: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బాలాపూర్‌లో ఘన నివాళులు!
Meerpet: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మీర్‌పేట్ బాలాపూర్ డివిజన్‌లో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఘన నివాళులర్పించారు.
Meerpet: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బాలాపూర్‌లో ఘన నివాళులు!
మీర్ పెట్: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బాలాపూర్ డివిజన్‌లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, కోలన్ తిరుపతి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నిరుడు శ్రీరాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




