Malkajgiri: మల్కాజిగిరిలో మీ సురక్ష 2.0 ప్రత్యేక డ్రైవ్

Malkajgiri: పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో మల్కాజిగిరిలో 20 బృందాలు మీ సురక్ష 2.0 చేపట్టి 230 సీసీటీవీల నమోదు, అద్దెదారుల వివరాల సేకరణ పూర్తి చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Oct 2026 8:52 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో మీ సురక్ష 2.0 ప్రత్యేక డ్రైవ్

మల్కాజిగిరి: పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు మీ సురక్ష 2.0 కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, కాలనీల్లో నివసించే ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇళ్లలో పనిచేసే పనివారు, వాచ్‌మెన్లు, డ్రైవర్లు, అద్దెకు నివసించే వారి వివరాలను సేకరించి మీ సురక్ష వెబ్‌సైట్‌లో జియో ట్యాగింగ్‌ చేశారు. అదేవిధంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎం ఆర్ సినీ ప్లానెట్, మారుతి నగర్ ప్రాంతాల్లో 230 సీసీటీవీ కెమెరాలను జియో ట్యాగింగ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ యాదగిరి రెడ్డి,పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ విజయ్ కుమార్, డీఐ, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సహకారంతో కాలనీల్లో భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri