Medipally: బతుకమ్మ పాటలకు మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు!

Medipally: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉత్సాహంగా నృత్యం చేసి సందడి చేశారు. పూర్తి వివరాలు.

KARUNAKAR, UPPAL
Published on: 13 Oct 2026 9:34 AM IST
Medipally
X

Medipally: బతుకమ్మ పాటలకు మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు!

Medipally: బతుకమ్మ పాటలు.. మహిళల ఆటపాటలు.. ఉత్సాహభరితమైన నృత్యాలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పీర్జాదిగూడ మాజీ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, ఆయన బృందం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు కాలు కలుపుతూ ఉత్సాహంగా నృత్యం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు.

విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ మహిళలు సైతం బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతున్నారని తెలిపారు. తెలంగాణ మహిళలు నవరాత్రులతోపాటు బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్‌రెడ్డి, కౌడే పోచయ్య, కొల్తూరి మహేష్‌, లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యువజన అధ్యక్షుడు ప్రభు, సీనియర్‌ నాయకుడు జావీద్‌ఖాన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL