Medchal: మేడ్చల్‌లో తాగి పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడి!

Medchal: మేడ్చల్‌లో కిష్టాపూర్ వద్ద వాహన తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడిన వ్యక్తిని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ కొట్టినట్లు బాధితుడు గిరి ఆరోపణ.

NAKSHATRAM, MEDCHAL
Published on: 23 Oct 2026 9:02 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో తాగి పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడి!

మేడ్చల్: మద్యం తాగి పట్టుబడిన వ్యక్తిని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ చెంపల పై చితకబాదిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

కాగా మేడ్చల్ ట్రాఫిక్ SI ఆధ్వర్యంలో శుక్రవారం కిష్టాపూర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.కాగా కలవలి గిరి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ మద్యం తాగి పట్టుపడ్డాడు.కాగా అతని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో తన ద్విచక్ర వాహనాన్ని ఇవ్వాలని మద్యం తాగకుండా ఉన్న మరో వ్యక్తి తన మిత్రుడిని పిలిపించి ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ తన తల్లి పై దుర్భాషలాడుతూ చంపలపై ఇష్టానుసారంగా కొట్టాడని బాధితుడు కాలివల గిరి తెలిపారు.దీంతోపాటుగా సదరు కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ లాక్కున్నాడని బాధితుడు పేర్కొన్నాడు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL