Medchal: మేడ్చల్‌లో అధికారుల నిర్లక్ష్యం రెండు నెలలుగా వెలగని వీధి దీపం
Medchal: మేడ్చల్ కింది బస్తీలోని దవాఖాన వెనుక రెండు నెలలుగా వీధి దీపం వెలగడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన.
Medchal: మేడ్చల్‌లో అధికారుల నిర్లక్ష్యం రెండు నెలలుగా వెలగని వీధి దీపం
మేడ్చల్: మేడ్చల్ 297 డివిషన్ లోని కింది బస్తీలో ఉన్న బస్తీ దవాఖాన వెనుక వీధిలో గత రెండు నెలలుగా వీధి దీపం వెలగడం లేదు. రాత్రి వేళల్లో వీధి చీకటిమయంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీధి దీపం పనిచేయడం లేదని సంబంధిత GHMC సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక బస్తీ యువకుడు కానుగంటి అవినాష్ చారి ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో చీకటి కారణంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.




