Medchal: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బైక్!

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధులకు వెళ్లి వస్తున్న యువకుడు శ్రీకాంత్ రోడ్డుపై నిలిచి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టి మృతి చెందాడు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 28 Oct 2026 8:51 AM IST
Medchal
X

Medchal: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బైక్!

Medchal: విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్మాజిగూడకు చెందిన కె శ్రీకాంత్ (26) గుండ్లపోచంపల్లిలోని గుబ్బాకోల్డ్ స్టోరేజ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై గుండ్లపోచంపల్లి నుంచి బర్మాజిగూడకు వెళ్తుండగా మార్గమధ్యలో బ్రేక్‌డౌన్‌ కారణంగా రోడ్డుపై నిలిచిపోయిన టిప్పర్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL