Quthbullapur: ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం!
Quthbullapur: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో శనివారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Quthbullapur: ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం!
కుత్బుల్లాపూర్: బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీరాములు, దేవర రమేష్, వారాల మహేష్, సాయి ప్రతాప్, కేశవ్ యాదవ్, విజేందర్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేశారు.




