Medchal: కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్

Medchal: మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్ నియామక పత్రం అందుకున్నారు.

PURENDAR, ALWAL
Published on: 30 Sept 2026 11:15 PM IST
Medchal
X

Medchal: కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్

మేడ్చల్: అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తానని మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు మాట్లా క్రాంతి కుమార్ అన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ఏ-బ్లాక్‌ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్ ను ఎంపిక చేశారు.

బుధవారం మేడ్చల్‌-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్బంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ ఏ-బ్లాక్‌ అధ్యక్షుడిగా నన్ను నియమించిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కావలి చంద్రయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నాకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి వారి హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తా. పార్టీని బలోపేతం చేస్తూ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL