Medchal: మేడ్చల్ కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

Medchal: మేడ్చల్ కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే గొప్ప పండుగ అని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రేణుక కొనియాడారు.

ASHOK, KAPRA
Published on: 16 Oct 2026 8:46 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

మేడ్చల్: బతుకమ్మ ప్రకృతి పండుగ ప్రకృతిలో దొరికే గునుగు, తంగేడు, తీరు రుద్రాక్షాలు, బంతి, చామంతి తీరొక్క పూలతో తీరు తీరు బతుకమ్మను పేర్చి అవే పువ్వులను నీటిలో వేసే ప్రకృతి పండుగ . పర్యావరణాన్ని కాపాడే పండుగ ఈ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు

శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా చీఫ్ ప్లానింగ్ ,జిల్లా విద్యాశాఖ, జిల్లా కో-ఆపరేటివ్,ఐ సి డి ఎస్, డి ఐ ఈ ఓ, ఆర్ అండ్ బి, జిల్లా సంక్షేమ శాఖలు ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

మేడ్చల్ కలెక్టరేట్ లో బతుకమ్మ వేడుకల్లో నాగారం, రాంపల్లి సెరెనిటీ పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొని తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి స్ఫురించేలా బతుకమ్మల అలంకరణ, పాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA