Kukatpally: కూకట్‌పల్లిలో గంజాయి పట్టివేత: యువకుడి అరెస్ట్!

Kukatpally: కూకట్‌పల్లి వసంత్‌నగర్ కమాన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 325 గ్రాముల ఎండు గంజాయితో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

Maruthisagar, Kukatpally
Published on: 13 Oct 2026 6:09 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో గంజాయి పట్టివేత: యువకుడి అరెస్ట్!

కూకట్‌పల్లి: వసంత్‌నగర్ కమాన్ సమీపంలో పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 325 గ్రాముల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో కవాడిగూడకు చెందిన మల్లెల శ్రవణ్ కుమార్ గౌడ్ (27)ను అరెస్ట్ చేశారు. డీపీఈఓ ఆదేశాల మేరకు, ఏఈఎస్ పర్యవేక్షణలో కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ బృందం, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై. నాగేందర్, ఎక్సైజ్ ఎస్‌ఐ బి. జనార్దన్ తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally