Medchal: కండ్లకోయ హాస్టల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ముకుందా హాస్టల్‌లో సీఎంఆర్ కళాశాల బీటెక్ ఈసీఈ విద్యార్థిని అక్షయ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Medchal: కండ్లకోయ హాస్టల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయలో ఉన్న ముకుందా హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి వివరాలు ఎల్లారెడ్డి నియోజకవర్గం సాతెల్లి గ్రామానికి చెందిన జంగిటి అక్షయ (19)గా గుర్తించారు.
ఈమె స్థానిక సీఎంఆర్ కళాశాలలో బిటెక్ ECE 2వ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎస్సై మహేందర్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి విచారణ చేపట్టారు. విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




