Medchal: గ్యాస్ సిలిండర్ పేలుడు.. యూపీ యువకుడికి తీవ్ర గాయాలు!
Medchal: మేడ్చల్ మల్లన్న కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు 108 సిబ్బంది సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స అందించారు.
Medchal: గ్యాస్ సిలిండర్ పేలుడు.. యూపీ యువకుడికి తీవ్ర గాయాలు!
Medchal: మేడ్చల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడికి సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారు 108 అంబులెన్స్ సిబ్బంది.ప్రమాద సమయంలో అప్రమత్తంగా స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది, తీవ్రంగా గాయపడిన యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర (23) మేడ్చల్‌లోని కండ్లకోయలో ఉన్న మయూర్ ఇండియా చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ సిబ్బంది సీతారాం, పైలట్ కరుణాకర్ వెంటనే స్పందించి, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం ధర్మేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించి బాధితుడికి వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు అభినందించారు...




