Medchal: వర్షాలు లేక పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు
Medchal: మేడ్చల్ మండలం రావొల్కోల్ గ్రామంలో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తున్నారు.
Medchal: వర్షాలు లేక పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ మండలం రావొల్కోల్ గ్రామంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్నకు వర్షం కరువవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి.
పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు చేతులెత్తేయకుండా, ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి చేన్లకు నీరు అందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ట్యాంకర్ల నీటి ఖర్చు అదనపు భారంగా మారుతోంది.
వర్షాలు కురవక… నీటి వసతి లేక… పెట్టుబడులు పెట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంట పండించాల్సిన రైతన్న… ఇప్పుడు పంటను బతికించుకునేందుకు నీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతుల పరిస్థితిని పరిశీలించి, పంటలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతు తలారి నరసింహ సన్నాపు భూమయ్య తమ ఆవేదనను వ్యక్తం చేశారు.




