Medchal: అల్వాల్ రైతుబజార్ తొలగింపుపై ఎంపీ ఈటల రాజేందర్‌ను కలసిన రైతులు!
Medchal: అల్వాల్ రైతుబజార్ తొలగింపును నివారించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరిన రైతులు. 1,500 రైతు కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని వినతి.
Medchal: అల్వాల్ రైతుబజార్‌ను తొలగిస్తే 1,500 రైతు కుటుంబాలకు నష్టం కలుగుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను ఆయన నివాసం వద్ద కలిసిన రైతులు.
అల్వాల్ రైతుబజార్‌ను ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం తొలగించనున్న నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుబజార్‌పై ఆధారపడిన సుమారు 1,500 రైతు కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్, సిద్దిపేట, మెదక్, నల్గొండ జిల్లాల గ్రామాల నుంచి రైతులు ఇక్కడికి కూరగాయలు తీసుకొస్తున్నారు.
ప్రతిరోజూ సుమారు 1,000 నుంచి 1,500 మంది రైతులు, వివిధ ప్రాంతాల నుంచి కూరగాయల విక్రయాలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 1999 జనవరి 26 నుంచి సుమారు 26 ఏళ్లుగా రైతుబజార్ రైతులకు జీవనాధారంగా కొనసాగుతోందని తెలిపారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారని వివరించారు.
రైతుబజార్‌ను తొలగించే పరిస్థితి ఉంటే అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి రైతుల జీవనోపాధిని కాపాడాలని ఈటలను విజ్ఞప్తి చేశారు.




