Medchal: పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
Medchal: పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు పర్మిట్ రూమ్ పక్కన ఉన్న రేకును కత్తిరించి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
ఉదయం నిర్వాహకులు దుకాణానికి వచ్చి చూడగా రేకు కత్తిరించి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి గురైన నగదు, మద్యం లేదా ఇతర వస్తువుల వివరాలను నిర్వాహకుల నుంచి సేకరిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దొంగలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.




