Medchal: కార్మికులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్!
Medchal: సద్దుల బతుకమ్మ సందర్భంగా జవహర్నగర్, చంద్రపురి కాలనీల పారిశుద్ధ్య మహిళా కార్మికులకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ దంపతులు చీరలు పంపిణీ చేశారు.
Medchal: కార్మికులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్!
మల్కాజ్గిరి: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ జవహర్ నగర్ డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ మహిళ కార్మికులకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ దంపతులు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేశారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో దాదాపు 100 మంది మహిళా కార్మికులకు తన సతీమణి నాగరాణి తో కలిసి చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, మునుముందు వారి సంక్షేమానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీమన్నారాయణ, మౌనిక రెడ్డి, వసంత, సవిత గౌడ్, భారతి, రజిత, వనిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.




