Shaikpet: అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్!
Shaikpet: హైదరాబాద్ షేక్పేట్ దర్గాలో నిర్వహించిన అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.
Shaikpet: అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్!
షేక్పేట్: హైదరాబాద్లోని షేక్పేట్ దర్గాలో రామకృష్ణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి వారి 18వ మహా పడిపూజ మహోత్సవంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలపై స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




