Medchal: వ్యాపారి నేమారం చౌదరి మృతిపై పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన!
Medchal: మేడ్చల్ మురహరి చెరువు వద్ద వ్యాపారి నేమారం చౌదరి మృతదేహం లభ్యం. హత్య చేసి పడేశారంటూ పెట్ బషీరాబాద్ పీఎస్ ఎదుట మార్వాడీ సంఘం నాయకుల బైఠాయింపు.
Medchal: వ్యాపారి నేమారం చౌదరి మృతిపై పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన!
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి,మురహరి చెరువు వద్ద లభ్యమైన నేమారం చౌదరి(55) మృతికి నిరసనగా పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న మార్వాడీ సంఘం నాయకులు. మృతుడు గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్న నేమారం చౌదరి (55) ని హత్య చేసి,చెరువు కట్ట వద్ద పడేశారని ఆరోపణ.
గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయలుదేరిన నేమారం చౌదరి. 3 వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు . మృతుడు (మర్చంట్) వెళ్లేముందు నగదుతో ఇంట్లోనుండి బయలుదేరినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు కేసును పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీ. ఇది హత్యనా లేదా ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు. నేమారం చౌదరి ని హత్య చేసిన వారిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు.




