Uppal: ఉప్పల్‌లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలి!

Uppal: ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్లు, సీసీ పనులకు నిధులు కేటాయించాలని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డికి మందుముల పరమేశ్వర్‌రెడ్డి వినతి.

ASHOK, KAPRA
Published on: 12 Oct 2026 5:38 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలి!

Uppal: ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి కోరారు. సోమ‌వారం మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ విన‌య్‌కృష్ణారెడ్డిని ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి క‌లిసి అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చించారు.

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉప్ప‌ల్‌, కాప్రా, నాచారం సర్కిళ్ల ప‌రిధిలో కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సంద‌ర్భంగా ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి గుర్తు చేశారు. పలు ప్రాంతాల్లో సరైన రహదారులు లేవని, అవసరమైన చోట్ల కమ్యూనిటీ హాళ్లు కూడా లేవ‌న్నారు. ప్రస్తుతం ఉన్న రహదారులు చాలా కాలంగా నిర్మించకపోవడం వల్ల దెబ్బతినడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. వీటిపై క‌మిష‌న‌ర్ సానుకూలంగా స్పందించిన‌ట్టుగా ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు.

వంపుగూడ డివిజన్లలో సాయిరాంనగర్, గోపాల్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లోని అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం.శాలివాహ‌న‌, వంపుగూడ ప్రాంతాల్లోని అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం. మైత్రి కాలనీలోని పొడిగింపు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం.

కాప్రా డివిజన్ లోని నిర్మల్ నగర్, సిద్ధి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం. సాయిపురి కాలనీ, గాంధీ నగర్‌లోని అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం. వినాయక్ నగర్ ఫేజ్–1, ఫేజ్–2, వెంకటాద్రి కాలనీలోని అంతర్గత వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణంవినాయక్ నగర్ ఫేజ్–2లోని ఉషోదయ సూపర్ మార్కెట్ ఎదురుగా సీసీ రోడ్ల నిర్మాణం.ఏఎస్ రావు నగర్ డివిజన్. జీఆర్ రెడ్డి నగర్‌లో ప్లాట్ నంబర్ 92 నుంచి హనుమాన్ ఆలయం వరకు సీసీ రోడ్ల నిర్మాణం.

బకాసుర హోటల్ ఎదురుగా ప్లాట్ నంబర్ 127 నుంచి వాటర్ ట్యాంక్ సమీపంలోని మహేశ్ నగర్ బై లేన్ల వరకు సీసీ రోడ్ల నిర్మాణం.

భవానీ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి షటిల్ కోర్టు వరకు సీసీ రోడ్ల నిర్మించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి ,పావని రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి,శ్రీహరి,టిల్లు యాదవ్,విఠల్ నాయక్,నాగరాజు,బాబు రావు,నాగశేషు,మల్లా రెడ్డి,కిషోర్,మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA