LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం!
LB Nagar: ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిన మల్‌రెడ్డి రాంరెడ్డి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో పేదలకు భరోసా అని వెల్లడి.
LB Nagar: ఎల్‌బీనగర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం!
LB Nagar: ఎల్‌బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
తెలంగాణ ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన రేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి గారు 2026 ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సేవలు మరింత సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
పేదల సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవం, ప్రతి కుటుంబానికి భరోసా అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి భరోసాగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి గారు, మైనారిటీ సీనియర్ నాయకులు జానిమియా గారు, గడ్డిఅన్నారం AMC డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి గారు, మెగావత్ గణేష్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు షరీఫ్ గారు, అజయ్ గారు, కాలనీ వాసులు పెంటా రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.




