Malkajgiri: చంద్రపురి కాలనీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం!
Malkajgiri: చంద్రపురి కాలనీ డివిజన్ ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్. కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ.
Malkajgiri: చంద్రపురి కాలనీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం!
Malkajgiri: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ 02 పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించిన డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కు కాలనీవాసులు పూల బొక్కే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ... గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం వారి స్వలాభాల కోసమే పది సంవత్సరాలు కాలయాపన చేశారన్నారు. డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానాని హామీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో డివిజన్ లో అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, శంకర్రావు తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.




